: పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి, గాలికి ఆశాభంగమేనా?
శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలైన టీడీపీ సీనియర్ నేతలు పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గాలి ముద్దుకృష్ణమ నాయుడులకు ఆశాభంగం తప్పేలా లేదు. శాసనసమండలి ఎన్నికలలో ఎమ్మెల్యేల కోటా నుంచి పదవిని చేపట్టాలని భావించిన ఈ ముగ్గురినీ పార్టీ అధినేత చంద్రబాబు దూరం పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్సీ పదవులపై ఎంతో ఆశ పెట్టుకున్న వీరిలో... ఏ ఒక్కరికి అవకాశం ఇచ్చినా మిగిలిన ఇద్దరూ మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నారట. దీంతో, ముగ్గుర్నీ దూరం పెడితే ఏ గొడవా ఉండదని అధినేత నిర్ణయించారు. అయితే ఈ ముగ్గురు కూడా తమ వైపు నుంచి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని వినికిడి. మరో విషయం ఏమిటంటే, ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు ఎమ్మెల్సీ అయినా... మంత్రి కావడం మాత్రం తథ్యం.