: 287 పరుగులకు జింబాబ్వే ఆలౌట్... రికార్డు సృష్టించిన టీమిండియా బౌలర్లు
వరల్డ్ కప్ లో నేటి ఉదయం ప్రారంభమైన మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు జింబాబ్వేను ఆలౌట్ చేశారు. తద్వారా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 48.5 ఓవర్లలో పది వికెట్లను పడగొట్టిన టీమిండియా బౌలర్లు... వరల్డ్ కప్ లో వరుసగా ఆరు మ్యాచ్ ల్లో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్ మెన్ ను పెవిలియన్ చేర్చిన ఘనతను సొంతం చేసుకున్నారు. దీంతో, లీగ్ దశలో అన్ని జట్లను ఆలౌట్ చేసిన జట్టుగా టీమిండియా అవతరించింది. జింబాబ్వే కెప్టెన్ బ్రెండన్ టేలర్ (138) వీరోచిత ఇన్నింగ్స్ తో ఆ జట్టు 287 పరుగుల భారీ స్కోరు సాధించింది. తొలుత మూడు వికెట్లను వెంటవెంటనే కోల్పోయిన జింబాబ్వే, టేలర్ వీరవిహారంతో భారత్ కు భారీ విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. 288 పరుగుల విజయలక్ష్యంతో ధోనీ సేన మరికాసేపట్లో బ్యాటింగ్ ప్రారంభించనుంది.