: విపక్షాల వాయిదా తీర్మానాల తిరస్కరణ... ప్రశ్నోత్తరాలను చేపట్టిన తెలంగాణ స్పీకర్


తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. వేతన సవరణ బకాయిలను బాండ్ల రూపంలో ఇవ్వాలన్న అంశంపై బీజేపీ; ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారంపై సీపీఐ; వీఆర్ఏల వేతనాల పెంపుపై సీపీఎం వాయిదా తీర్మానాలు ప్రతిపాదించాయి. వీటిని తిరస్కరించిన స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఇక సస్పెన్షన్ నేపథ్యంలో టీడీపీ సభ్యులు సభకు రాలేదు. వీరిపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని సభ ప్రారంభానికి ముందు పలు పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు. నేటి సమావేశాల్లో భాగంగా బడ్జెట్ పై చర్చ కొనసాగనుంది.

  • Loading...

More Telugu News