: కల్యాణకట్టలో క్షురకుల కొరత... తలనీలాలిచ్చేందుకు క్యూ కట్టిన వెంకన్న భక్తులు
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కల్యాణకట్ట వద్ద భక్తులు భారీగా క్యూ కట్టారు. తిరమల వెంకన్న దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తజనం తలనీలాలిచ్చేందుకు కల్యాణకట్ట చేరుకున్నారు. దీంతో అక్కడ క్యూ లైన్ల పొడవు క్రమంగా పెరుగుతోంది. సరిపడినంత మంది క్షురకులు లేని కారణంగా తలనీలాలిచ్చేందుకే గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తుండటంతో భక్తులు అసహనానికి గురవుతున్నారు. శ్రీవారి దర్శనాన్ని నిర్దేశిత సమయంలో అందుకోలేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లపై దృష్టి సారించని టీటీడీ సిబ్బందిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.