: విలియమ్స్ ఔట్... కీలక జోడీని విడదీసిన అశ్విన్
భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన జింబాబ్వే జోడిని ఎట్టకేలకు రవిచంద్రన్ అశ్విన్ విడగొట్టాడు. ఆదిలోనే మూడు వికెట్లను కోల్పోయి, కష్టాల్లో పడిన జింబాబ్వే ఇన్నింగ్స్ ను కెప్టెన్ బ్రెండన్ టేలర్ (55)తో కలిసి చక్కదిద్దిన సీన్ విలియమ్స్ (50)ను ఎట్టకేలకు అశ్విన్ బోల్తా కొట్టించాడు. హాఫ్ సెంచరీతో చెలరేగిన విలియమ్స్, 57 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. 29వ ఓవర్ ను వేసిన అశ్విన్, విలియమ్స్ బ్యాట్ తాకి పైకి లేచిన బంతిని జాగ్రత్తగా ఒడిసిపట్టేశాడు. దీంతో విలియమ్స్ వెనుదిరగక తప్పలేదు. 30 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే 128 పరుగులు చేసింది.