: రూ.5 కోట్ల సర్కారీ భూమిని రాసిచ్చిన సబ్ రిజిస్ట్రార్... తహశీల్దార్ ఫిర్యాదుతో కేసు నమోదు


కృష్ణా జిల్లాలో ఓ సబ్ రిజిస్ట్రార్ అవినీతి కలకలం రేపుతోంది. రూ.5 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని సదరు సబ్ రిజిస్ట్రార్ కాంగ్రెస్ నేతలకు అప్పనంగా రాసిచ్చేశారు. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సంబంధిత తహశీల్దార్ సబ్ రిజిస్ట్రార్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళితే... జిల్లాలోని పెడన సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న జగన్, స్ధానిక కాంగ్రెస్ నేతలు రామచంద్రమూర్తి, రాంబాబులతో కుమ్మక్కయ్యారు. రూ.5 కోట్ల విలువ చేసే సర్కారీ భూమిని వారి పేరిట రాసిచ్చేశారు. అయితే ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని తెలిపేందుకు మరో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సదరు భూమి రిజిస్ట్రేషన్ తంతును ముగించారు. దీనిపై అనుమానం వచ్చిన స్థానికులు ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. దీంతో వారు తహశీల్దార్ కు ఫిర్యాదు చేశారు. సదరు భూమి రిజిస్ట్రేషన్ తంతును నిర్ధారించుకున్న తహశీల్దార్, చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో జగన్ పై ఫిర్యాదు చేశారు. దీంతో జగన్ తో పాటు భూమి చేజిక్కించుకున్న కాంగ్రెస్ నేతలపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News