: రామానాయుడు స్టూడియోలో ఎల్ఈడీ లైట్లు మాయం... పోలీసుల అదుపులో నిందితులు
టాలీవుడ్ లో చోరీల పరంపర కొనసాగుతోంది. చిత్రసీమకు చెందిన ప్రముఖ నటుల ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలు తాజాగా స్టూడియోలపైనా పడ్డారు. తెలుగు చిత్రసీమలో ప్రముఖ స్టూడియోగా పేరుగాంచిన రామానాయుడు స్టూడియోలో నిన్న భారీ చోరీ జరిగింది. లక్షల విలువ చేసే ఎల్ఈడీ లైట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో స్టూడియో మేనేజ్ మెంట్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వెనువెంటనే రంగంలోకి దిగి చోరీకి పాల్పడ్డట్టుగా భావిస్తున్న అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.