: మీ దేవుడేమో నల్లన... తెల్లని వధువులు కావాలంటారు: శరద్ యాదవ్


జేడీ(యూ) అధినేత శరద్ యాదవ్ దక్షిణ భారత మహిళలపై రాజ్యసభలో ఎలాంటి వ్యాఖ్యలు చేశారో చూడండి! బీమా బిల్లుపై చర్చ సందర్భంగా యాదవ్ మాట్లాడుతూ, మెరిసే మేని ఛాయ పట్ల భారతీయుల మోజు గురించి వివరించారు. "మీ దేవుడేమో రవిశంకర్ ప్రసాద్ (ఎంపీ) లాగా నల్లనివాడు. మరి, మీ మ్యారేజి బ్యూరో యాడ్స్ లో మాత్రం తెల్లని వధువులు కావాలని ప్రకటనలిస్తారు" అని దక్షిణభారతదేశానికి చెందిన వ్యక్తులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అనంతరం, ఆయన తన సౌందర్య దృష్టిని దక్షిణ భారత మహిళలపైకి మళ్లించారు. "సౌతిండియాలో స్త్రీలు నల్లగా ఉంటారు. అయితే, వారి అందం కూడా వారి శరీరాల్లాగే ఉంటుంది" అని పేర్కొన్నారు. ఇక, నిర్భయ ఉదంతాన్ని ఇండియాస్ డాటర్ పేరిట డాక్యుమెంటరీగా మలచిన లెస్లీ ఉడ్విన్ గురించి చెబుతూ, ఆమె తన తెల్ల తోలు కారణంగానే, రేపిస్టుల ఇంటర్వ్యూలకు సులభంగా అనుమతులు సంపాదించి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై డీఎంకే ఎంపీ కనిమొళి అభ్యంతరం వ్యక్తం చేశారు. చర్చపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News