: కేజీ బేసిన్ గ్యాస్ ను తెలుగు రాష్ట్రాలకు బదలాయించిన కేంద్రం


కృష్ణా-గోదావరి బేసిన్ లో లభ్యమయ్యే సహజవాయువును ఇకపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వినియోగించుకునేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ సహజవాయువును గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలకు తరలించేందుకు కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ అంగీకారం తెలిపింది. కేంద్రం నిర్ణయంతో ఉభయ రాష్ట్రాలకు 450 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. తెలంగాణలో 285 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. రానున్నది వేసవి కావడంతో కరెంటు కష్టాలు పెరగనున్న నేపథ్యంలో, కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇరు రాష్ట్రాలకు ఊరటనిచ్చేదే.

  • Loading...

More Telugu News