: మైనారిటీలు ఎవరూ లేరు, డీఎన్ఏ పరంగా అందరూ హిందువులే: ఆర్ఎస్ఎస్


భారత్ లో మైనారిటీలంటూ ఎవరూలేరని, డీఎన్ఏ పరంగా, సంస్కృతి పరంగా అందరూ హిందువులేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వ్యాఖ్యానించింది. నాగ్ పూర్ లో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభలో ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ హోసబలే మాట్లాడుతూ, "ఎవరిని పిలుస్తున్నారు మీరు మైనారిటీలని? మేం ఎవరినీ మైనారిటీలుగా పరిగణించడంలేదు. అల్పసంఖ్యాక వర్గమే లేనప్పుడు ఆ భావనకు కూడా తావులేదు. మోహన్ భగవత్ (ఆర్ఎస్ఎస్ చీఫ్) గారు 20 సార్లు చెప్పారు... భారత్ లో పుట్టినవారందరూ హిందువులేనని. వారు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా... వాళ్లు సంస్కృతి పరంగా, జాతీయత పరంగా, డీఎన్ఏ పరంగా హిందువులే" అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News