: నందమూరి కల్యాణ్ రామ్ పై పోలీసులకు ఫిర్యాదు


జాతీయ చిహ్నాన్ని కించపరిచారంటూ హీరో, నిర్మాత నందమూరి కల్యాణ్ రామ్ పై శ్రీధర్ అనే న్యాయశాస్త్ర విద్యార్థి హైదరాబాదు. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'పటాస్' టైటిల్లో జాతీయ చిహ్నమైన అశోక చక్రాన్ని ముద్రించారని, అది చట్టవిరుద్ధమని శ్రీధర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కల్యాణ్ రామ్ కు ఈ విషయమై లీగల్ నోటీసు పంపినా స్పందించలేదని తెలిపారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ సినిమా కార్యాలయంపైనా కేసు నమోదు చేయాలని తన ఫిర్యాదులో కోరారు. దీనిపై బంజారాహిల్స్ పోలీసులు స్పందించారు. కల్యాణ్ రామ్ పై కేసు నమోదు చేసే అంశంలో నిపుణుల సలహా తీసుకుంటామని తెలిపారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ తానే హీరోగా నిర్మించిన చిత్రం 'పటాస్'. ఈ చిత్రం మాస్ ఎంటర్టయినర్ గా మంచి వసూళ్లను రాబట్టింది.

  • Loading...

More Telugu News