: చివరి మ్యాచ్ లో ఇంగ్లండ్ కు ఊరట


వరల్డ్ కప్ లో దారుణ వైఫల్యం చెందిన ఇంగ్లండ్ జట్టు గ్రూప్ దశ చివరి మ్యాచ్ లో విజయం సాధించి ఊరట పొందింది. ఆఫ్ఘనిస్థాన్ పై డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్లు 36.2 ఓవర్లలో 7 వికెట్లకు 111 పరుగులు చేయగా, ఆ దశలో వర్షం అంతరాయం కలిగించింది. దీంతో, ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ ను అంతటితో ముగించి, డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఇంగ్లండ్ లక్ష్యాన్ని25 ఓవర్లలో 101 పరుగులుగా నిర్దేశించారు. సాధించాల్సిన రన్ రేట్ తక్కువగానే ఉండడంతో ఇంగ్లండ్ ఓపెనర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. బెల్ (52 నాటౌట్), హేల్స్ (37) రాణించంతో ఆ జట్టు 18.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 101 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మొత్తం 6 మ్యాచ్ లాడిన ఇంగ్లండ్ 2 విజయాలు, 4 ఓటములతో గ్రూప్-ఏలో ఐదోస్థానంలో నిలిచింది.

  • Loading...

More Telugu News