: తోపుడు బళ్ల వ్యాపారాన్ని చట్టబద్ధం చేసిన మమత బెనర్జీ
వీధుల్లో తోపుడు బళ్లపై చేసుకునే వ్యాపారాన్ని చట్టబద్ధం చేస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్ర ప్రభుత్వం తమదే అని ఆమె గర్వంగా చెప్పారు. గత 72 గంటలుగా సమ్మె చేస్తున్న చిరు వ్యాపారులను ఉద్దేశించి ప్రసంగించిన ఆమె... తోపుడు బళ్ల వ్యాపారాన్ని చట్టబద్ధం చేయడంతో చిరు వ్యాపారులకు భద్రత, భరోసా కలుగుతాయని చెప్పారు. దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే రూపొందిస్తామని తెలిపారు. జూలై 15 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని... సరైన వారికి ట్రేడ్ లైసెన్సులు మంజూరు చేస్తామని చెప్పారు.