: కుటుంబ సభ్యుల సహా భోజ్ పురి సింగర్ ఆత్మహత్య


మంచి భవిష్యత్తుందని భావిస్తున్న వికాస్ రాయ్ (18) అనే భోజ్ పురి వర్ధమాన గాయకుడు తన కుటుంబం సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వికాస్ రాయ్, అతని తండ్రి సంతోష్ కుమార్ రాయ్ (50), తల్లి సునీతా దేవి (40), సోదరుడు విశాల్ రాయ్ (16), సోదరి బ్యూటీ కుమారి (15) బలవన్మరణం చెందగా, అతని చిన్న తమ్ముడు రవి రాయ్ (12) పరిస్థితి విషమంగా ఉంది. బీహార్లోని డేహ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పోష్ కాలనీలో నివాసముంటున్న వికాస్ రాయ్ కుటుంబం ఆర్థిక కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. విషం కలిపిన స్వీట్స్ తిని వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ నివాసంలో తినదగిన, తాగదగిన ప్రతి పదార్థంలోనూ విషం కలుపుకున్నారని పోలీసులు వివరించారు. ఇష్టపూర్వకంగానే వారు చనిపోయినట్టు అర్థమవుతోందని వారు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News