: క్షిపణులను విజయవంతంగా ప్రయోగించిన ఉత్తర కొరియా
ఉత్తర కొరియా మరోసారి క్షిపణి పరీక్షలను నిర్వహించింది. ఏడు స్వల్ప శ్రేణి క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్న సమయంలోనే ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించడం గమనార్హం. ఈ వివరాలను దక్షిణ కొరియా రక్షణ అధికారి ఒకరు వెల్లడించారు. పశ్చిమ తీరం నుంచి తూర్పు తీరంలోకి... భూమి నుంచి ఆకాశానికి ప్రయోగించే క్షిపణులను పరీక్షించిందని దక్షిణ కొరియా తెలిపింది. అమెరికా, దక్షిణ కొరియాల సంయుక్త సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.