: ఇదో కుటుంబ రికార్డులా ఉందే: అమితాబ్
వచ్చే నెలలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక 'పద్మ విభూషణ్' పురస్కారం అందుకోబోతున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (72) ఆనందంతో పొంగిపోతున్నాడు. తాజా అవార్డుతో తన కుటుంబానికి 6 పద్మ పురస్కారాలు లభించినట్టవుతుందని అన్నారు. చూస్తుంటే, ఒకే కుటుంబానికి ఇన్ని పద్మ అవార్డులు రావడం ఓ రికార్డేమోనని అభిప్రాయపడ్డారు. తనొక్కడికే 3 పద్మ పురస్కారాలు దక్కడం దేవుడి దయ అని పేర్కొన్నారు. "తొలుత మా నాన్న గారు పద్మ భూషణ్ అందుకున్నారు. తర్వాత నేను పద్మ శ్రీ, పద్మ భూషణ్ తీసుకున్నా. అనంతరం, జయ (భార్య) పద్మ శ్రీ అందుకోగా, ఐశ్వర్య (కోడలు) కూడా పద్మ శ్రీ స్వీకరించింది. ఇప్పుడు నాకు పద్మ విభూషణ్!" అని తన బ్లాగులో తెలిపారు. కాగా, 'పద్మ' పురస్కారాలను ఏప్రిల్ 8న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రదానం చేయనున్నారు.