: అంకెలు కూడా మార్చకుండా బడ్జెట్ పెట్టారు... టి బడ్జెట్ పై జానా అసంతృప్తి


తెలంగాణ బడ్జెట్ పై టీఎస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. బడ్జెట్ పై జరిగిన చర్చలో ఆయన ప్రసంగిస్తూ, కనీసం అంకెలు కూడా మార్చకుండా బడ్జెట్ పెట్టడమేంటని ప్రశ్నించారు. గత ఐదు నెలల్లో చేసిన ఖర్చుల వివరాలు తెలపలేదని అన్నారు. బడ్జెట్ లో చూపినంత ఆదాయాలు రావని, గ్రాంట్స్ కూడా ప్రభుత్వం చూపినంతగా ఉండవని చెప్పారు. రూ. 20వేల కోట్ల నిధులు కచ్చితంగా తగ్గుతాయని... ఆమేరకు అభివృద్ధి పథకాల నిధులకు కూడా కోత తప్పకపోవచ్చని అన్నారు. కేవలం అలంకారప్రాయంగానే బడ్జెట్ ఉందని... గణాంకాలు గందరగోళంగా ఉన్నాయని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ల సంగతి ఏమైందని వ్యంగ్యం ప్రదర్శించారు.

  • Loading...

More Telugu News