: 'గ్రూప్-ఎ'లో కివీస్ క్లీన్ స్వీప్


ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు వరల్డ్ కప్ లో గ్రూప్ దశను అజేయంగా ముగించింది. ఆడిన 6 మ్యాచ్ లలోనూ విజయభేరి మోగించి గ్రూప్-ఎ నుంచి టాపర్ గా నాకౌట్ దశకు చేరింది. నేడు హామిల్టన్ లోని సెడాన్ పార్క్ మైదానంలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో కివీస్ జట్టు 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 288 పరుగులు చేసింది. మహ్మదుల్లా (128 నాటౌట్) అజేయ సెంచరీతో రాణించాడు. సౌమ్యా సర్కార్ 51, షబ్బీర్ రెహ్మాన్ 40 పరుగులు చేశారు. బౌల్ట్, కోరే ఆండర్సన్, ఇలియట్ తలో 2 వికెట్లు తీశారు. అనంతరం, లక్ష్యఛేదనకు దిగిన కివీస్ జట్టు 48.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. ఓపెనర్ గుప్టిల్ 105 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రాస్ టేలర్ 56 పరుగులు చేశాడు. షకిబ్ అల్ హసన్ 4 వికెట్లు తీశాడు. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' గుప్టిల్ కు లభించింది.

  • Loading...

More Telugu News