: లఖ్వీ విడుదలపై పాక్ హైకమిషనర్ కు భారత్ సమన్లు
ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి జకీయుర్ రెహ్మాన్ లఖ్వీ విడుదల అంశంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజాగా, ఇస్లామాబాద్ హైకోర్టు లఖ్వీని విడుదలచేయాలని ఆదేశించిన అంశంపై భారత్ లో పాకిస్థాన్ హైకమిషనర్ కు విదేశాంగ శాఖ సమన్లు పంపింది. ఈ మేరకు హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ కు విదేశాంగ కార్యదర్శి అనిల్ వాద్వా సమన్లు పంపారు. లఖ్వీ బెయిల్ పొంది ఉండవచ్చుగానీ ఇంకా అతనిపై విచారణ కొనసాగుతోందని వాద్వా అన్నారు. ఈ విషయాన్ని పాక్ ఉన్నతస్థాయి అధికారుల వద్ద లేవనెత్తామని, కోర్టు తీర్పు పట్ల భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళనకు గురైనట్లు చెప్పామని ప్రభుత్వ అధికారుల సమాచారం.