: ఏపీ శాసనసభ సోమవారానికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారానికి వాయిదాపడింది. సభలో గంటకుపైగా సాగిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే సభను ఈ నెల 16కు వాయిదా వేస్తున్నట్టు సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. సభలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆందోళనతో సభ నాలుగుసార్లు వాయిదాపడగా, అధిక సమయం వైసీపీ వాయిదా తీర్మానాలపైనే చర్చ జరిగింది. ఈ క్రమంలో సోమవారం నుంచి ఏపీ బడ్జెట్ పై చర్చ జరగనుంది.