: యుద్ధానికి కాలు దువ్వం... యుద్ధం వస్తే విజయం మనదే: రక్షణ శాఖ మంత్రి సంచలన వ్యాఖ్య
కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశాలతో యుద్ధానికి కాలు దువ్వబోమన్న ఆయన, యుద్ధం వస్తే మాత్రం విజయం మనదేనని వ్యాఖ్యానించారు. భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియాలో రక్షణ శాఖదే కీలక భూమిక అని ఆయన వ్యాఖ్యానించారు. భారత సైన్యంలో రెజిమెంట్ల సంఖ్య పెరగాల్సి ఉందన్న ఆయన, ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.