: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చెప్పుచేతల్లో లాటరీలు... కేంద్రాన్ని అలర్ట్ చేసిన ఐబీ!


దేశంలో శాంతిభద్రతలకు పెను సవాల్ విసురుతున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, భారత ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందట. ఈ మేరకు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. దేశంలోని లాటరీలన్నీ కూడా దావూద్ కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయని ఐబీ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. నమ్మకమైన ఏజెంట్లను నియమించుకునే విషయంలో పక్కాగా వ్యవహరించే దావూద్, దేశంలోని లాటరీల నిర్వహణకు కూడా తన అనుయాయులను రంగంలోకి దింపాడని ఐబీ వర్గాలు అనుమానిస్తున్నాయి. భారత గూఢచార సంస్థ రీసెర్చి అండ్ అనాలసిస్ వింగ్ (రా) అందించిన ఆధారాల మేరకు ఐబీ, కేంద్రాన్ని ఈ మేరకు హెచ్చరించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతున్న లాటరీల తంతు మొత్తాన్ని దావూద్ తన అధీనంలోకి తీసుకున్నాడని ఐబీ చెబుతోంది. ఇదే నిజమైతే, ఇప్పటికే పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్న లాటరీల కారణంగా భారీ నష్టాలను చవిచూస్తున్న జనం, మరింత మేర నష్టపోక తప్పదని కూడా ఐబీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

  • Loading...

More Telugu News