: ఎంపీ కవిత జన్మదినం నేడు... పలు కార్యక్రమాల నిర్వహణ... హాజరుకానున్న హీరో రాజా
టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత జన్మదినం నేడు. 1978 సంవత్సరంలో ఆమె జన్మించారు. ఆమె జన్మదినం సందర్భంగా ఈ ఉదయం ఆమె నివాసంలో కేక్ కటింగ్ జరిగింది. కవిత జన్మదినం సందర్భంగా పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. తెలంగాణ భవన్ లో జాగృతి యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అలాగే ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పక్కన అమర వేదిక రెయిన్ బో హోమ్ ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఉస్మానియా యూనివర్శిటీ బస్తీలో మంచినీటి ట్యాంక్ ను ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు సరూర్ నగర్ లోని వీఎం హోమ్ లో 750 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమానికి సినీ హీరో రాజా కూడా హాజరవుతారు.