: జగన్ ను మాట్లాడనివ్వని స్పీకర్... మరోసారి అసెంబ్లీ వాయిదా


తమ నేత మాట్లాడేందుకు కనీసం మైకును కూడా ఇవ్వడం లేదని వైకాపా సభ్యులు అసెంబ్లీలో ఆందోళన చేపట్టారు. ఆ పార్టీ ఎంఎల్ఏలు పోడియం ముందుకు వచ్చి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. తామిచ్చిన వాయిదా తీర్మానాలపై తక్షణం చర్చను చేపట్టాలని వైకాపా డిమాండ్ చేస్తోంది. వాయిదా తీర్మానాలను స్పీకర్ కోడెల తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైకాపా ఆందోళన చేసినప్పటికీ, జగన్ కు మైకు ఇచ్చేందుకు నిరాకరించిన స్పీకర్, సభను మూడోసారి 10 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

  • Loading...

More Telugu News