: నన్ను కోహ్లీతో పోల్చొద్దు... పాక్ వికెట్ కీపర్ ఉమర్ అక్మల్


టీమిండియాకు విరాట్ కోహ్లీ వైస్ కెప్టెన్ మాత్రమే కాదు, ఒంటిచేత్తో విజయం సాధించి పెట్టే సత్తా ఉన్న బ్యాట్స్ మన్. ఇక ఉమర్ అక్మల్, పాక్ జట్టు కీపర్ మాత్రమే. యూనిస్ ఖాన్, షెహజాద్, ఆఫ్రిదీ, మిస్బాల తర్వాత అతడూ ఓ రకంగా మంచి బ్యాట్స్ మనే. అయితే తనను విరాట్ కోహ్లీతో పోలుస్తున్నారని, అక్మల్ మండిపడుతున్నాడట. ఫస్ట్ డౌన్ లో కోహ్లీ వస్తే, తాను మాత్రం ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్ కు వస్తున్నానని అతడు వ్యాఖ్యానించాడు. ఈ కారణంగానే తమ ఇద్దరి మధ్య పోలిక వద్దని చెబుతున్నాడట. ఆరు, ఏడు స్థానాల్లో కోహ్లీని బ్యాటింగ్ కు దిగమనండి, నాకంటే మెరుగ్గా రాణించమనండి.. అప్పుడు పోలిక ఒప్పుకుంటానని చెబుతున్నాడట. అయితే కోహ్లీ లాగా ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగుతారా? అన్న ప్రశ్నకు మాత్రం అతడు స్పందించకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News