: యాపిల్ యూజర్ల కోసం నోకియా 'హియర్ మ్యాప్స్'


నోకియా పేరుతో మొబైళ్లు అదృశ్యమయ్యాక... తాజాగా మ్యాపింగ్ సేవలను అందించబోతోంది నోకియా. వాటిని యాపిల్ యాప్ స్టోర్లలో ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. యాపిల్ ఐఫోన్స్, ఐపాడ్స్ లో ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ డివైజెస్ ఉపయోగించేవారికి ఈ మ్యాప్స్ లో నావిగేషన్, 150 దేశాలను కవర్ చేసే సెర్చు ఫీచర్స్ తక్షణమే అందుబాటులో ఉంటాయి. ఇప్పటివరకు దాదాపు 4 మిలియన్ల యూజర్లకు పైగా 'హియర్' మ్యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నట్టు నోకియా తెలిపింది. కాగా విండోస్ ఫోన్స్ లో ఈ మ్యాప్స్ ఫిక్స్ డ్ ఫీచర్ గా ఉంటాయని, 40 కంటే పైగా దేశాల ట్రాఫిక్ సమాచారాన్ని కూడా మ్యాప్స్ లో తెలుసుకోవచ్చట.

  • Loading...

More Telugu News