: పార్టీ అగ్రనేతలతో బీజేపీ నేత కన్నా భేటీ... ఏపీకి న్యాయం జరుగుతుందని వ్యాఖ్య


మొన్నటిదాకా కాంగ్రెస్ లో కీలక నేతగా వ్యవహరించిన మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కొన్నాళ్ల పాటు బయటకు రాని ఆయన నేడు ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్ లతో ఆయన వరుస భేటీలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి బీజేపీ సర్కారు న్యాయం చేసి తీరుతుందని ప్రకటించారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి ఏమీ చేయలేదని ఏపీ సర్కారు కేంద్రంపై విమర్శలు గుప్పించడం సరికాదన్నారు. రాష్ట్రం కోసం ముందు మీరు ఏం చేశారో ప్రశ్నించుకోండని ఆయన చంద్రబాబు సర్కారుకు సూచించారు.

  • Loading...

More Telugu News