: 15+6=17! వరుడికి లెక్కలు రావని వదిలేసిన వధువు


వరుడి విద్యార్హతల విషయమై వధువుకు సందేహం వచ్చింది. మరికాసేపట్లో మెడలో తాళి పడుతుందనగా ఆమె అనుమానంతో 15, 6 కలిపితే ఎంత? అని అడిగింది. దానికా వరుడు ఇచ్చిన సమాధానం 17. అంతే, 'వీడికి చదువు రాదు' అని తేల్చిన వధువు పెళ్లి పీటలపై నుంచి లేచింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగింది. ఇటావా జిల్లాకు చెందిన మెహర్ సింగ్ కుమార్తెకి, రామ్ బారన్ కి వివాహం నిశ్చయించగా, వరుడి చదువు విషయంలో నిజాలు దాచారని వధువు గుర్తించింది. ఇంత సులువైన లెక్కను కూడా చెప్పలేని వాడు నాకొద్దు పొమ్మనగా, పెళ్లి పెద్దలు నచ్చజెప్పాలని చూసినా ఆమె పట్టు వీడలేదు. చివరికి పరస్పరం ఇచ్చుకున్న కానుకలు ఎవరివి వారు వెనక్కి తీసుకునేలా రాజీ కుదుర్చుకున్నారు.

  • Loading...

More Telugu News