: అవినాష్ వ్యవహారంలో పెద్ద తలలు... తీగలాగుతున్న పోలీసులు


మానవ హక్కుల సంఘం ప్రతినిధిని అంటూ అవినాష్ చేసిన దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిన్న హైదరాబాద్ డీఐజీ కార్యాలయంలో లొంగిపోయిన అవినాష్ ను కాకినాడ పోలీసులకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అవినాష్ వెనుక బడా నేతలు ఉన్నారని అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు. అవినాష్ చేతిలో తీవ్రంగా దెబ్బలుతిన్న బాధితులను కృష్ణా జిల్లా చిల్లకల్లు పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఉదయం బాధితులు రామకృష్ణ, వేణు గోపాల్ లను పిలిపించిన పోలీసులు అసలు ఏం జరిగిందన్న విషయాన్ని తెలుసుకుంటున్నారు. వీరి విచారణకు కాకినాడ పోలీసులు కూడా హాజరయ్యారు. వీరిని ప్రశ్నించిన తరువాత ఇతర బాధితులను, ఆపై అవినాష్ ను విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. తాజాగా మరో ఇద్దరు బాధితులు అవినాష్ తమను వేధించారని పోలీసులను ఆశ్రయించారు. కాగా, తాను హోంమంత్రి సన్నిహితుడిని అని చెప్పుకుంటూ అవినాష్ పలు దుర్మార్గాలకు పాల్పడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News