: ఇంజినీరింగ్ కళాశాల బస్సు బీభత్సం... విజయనగరంలో ఆరుగురు విద్యార్థులకు గాయాలు


విజయనగరంలో ఓ ఇంజినీరింగ్ కళాశాల బస్సు కొద్దిసేపటి క్రితం బీభత్సం సృష్టించింది. పట్టణంలోని రింగ్ రోడ్ సమీపంలో అదుపు తప్పిన బస్సు విద్యార్థులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులను చికిత్స నిమిత్తం స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బస్సుపై మూకుమ్మడిగా దాడికి దిగారు. స్థానికుల ఆగ్రహావేశాలను చూసి భయభ్రాంతుడైన బస్సు డ్రైవర్ చిన్నగా అక్కడి నుంచి జారుకున్నాడు.

  • Loading...

More Telugu News