: వాయిదా తీర్మానాలపై చర్చకు వైసీపీ పట్టు... ప్రారంభమైన వెంటనే వాయిదా పడ్డ ఏపీ అసెంబ్లీ
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. అంగన్ వాడీ కార్యకర్తల సమస్యలపై చర్చ కోసం ప్రతిపక్ష వైసీపీ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది. అయితే దీనిని తిరస్కరించిన స్పీకర్ కోడెల శివప్రసాద్, ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దీంతో తమ వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాల్సిందేనని వైసీపీ పట్టుబట్టింది. ఈ క్రమంలో నినాదాలు చేస్తూ సభను అడ్డుకుంది. ప్రతిపక్ష సభ్యుల నిరసనతో ప్రారంభమైన వెంటనే సభను స్పీకర్ పది నిమిషాల పాటు వాయిదా వేశారు. దీంతో ఎలాంటి చర్చ లేకుండానే సభ వాయిదా పడింది.