: సహజీవనం చేసి సజీవదహనం చేశాడు... మహిళ సహా రెండేళ్ల బాలుడు కాలిబూడిదైన వైనం
సహజీవనం పేరిట మహిళను తల్లిని చేసిన మృగాడు దారుణానికి ఒడిగట్టాడు. మహిళతో పాటు వారి సహజీవనానికి ప్రతిరూపంగా జన్మించిన రెండేళ్ల బాలుడిని సజీవ దహనం చేశాడు. భయోత్పాతం సృష్టించే ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... గండికోట మణికంఠ అనే వ్యక్తి స్థానికంగా ఉంటున్న ఓ మహిళతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. వీరికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. నిన్న రాత్రి వారి ఇంటి నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేయగా, ఇంట్లోకి వెళ్లి చూసిన పోలీసులు... మహిళ, రెండేళ్ల బాలుడి మృత దేహాలను గుర్తించారు. వారిని హత్య చేసిన మణికంఠ, ఆ నేరం నుంచి తప్పించుకునేందుకే ఇంటికి నిప్పంటించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.