: గొర్రెలకాపరి కొడుకు గేట్ లో మెరిశాడు... టాప్ ర్యాంకుల్లో తెలుగు తేజాలు!


వెనుకబడ్డ రాయలసీమ జిల్లా కడపకు చెందిన ఓ గొర్రెలకాపరి కొడుకు నిన్న విడుదలైన గేట్ పరీక్ష ఫలితాల్లో దుమ్మురేపాడు. జాతీయ స్థాయిలో ఆరో ర్యాంకు సాధించి, తెలుగోడి సత్తా చాటాడు. ఇదే జిల్లాకు చెందిన మరో విద్యార్థి చంద్రకాంత్ రెడ్డి జాతీయ స్థాయి టాపర్ గా నిలిచాడు. ఐఐటీ, ఎన్ఐటీ, జాతీయ ఇంజినీరింగ్ విద్యా సంస్థల్లో పీజీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించిన గేట్-2015లో కడప జిల్లా మారుమూల గ్రామం టమటంవారిపల్లెకు చెందిన గొర్రెల కాపరి కొడుకు గుర్రప్ప జాతీయ స్థాయిలో ఆరో ర్యాంకు సాధించాడు. ఇక తెలంగాణలోని బాసర ఆర్జీయూకేటీ కేంపస్ విద్యార్ధి ప్రశాంత్ 65వ ర్యాంకు సాధించాడు.

  • Loading...

More Telugu News