: ఇక అగ్రస్థానమే లక్ష్యం... ప్రపంచ రెండో ర్యాంకులో సైనా నెహ్వాల్!
ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లో భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ అగ్రస్ధానానికి మరో అడుగు దూరంలో నిలిచింది. నిన్న బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ప్రకటించిన ర్యాకింగ్స్ లో సైనా నెహ్వాల్ కు రెండో ర్యాంకు దక్కింది. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో టైటిల్ పోరు దాకా వెళ్లగలిగిన సైనా ఓ ర్యాంకు మెరుగుపరచుకుని రెండో స్థానానికి చేరుకుంది. ‘‘ఆల్ ఇంగ్లండ్ టైటిల్ వేటలో మెరుగైన ప్రదర్శనతో రెండో ర్యాంకు వస్తుందని తెలుసు. ఇక అగ్రస్థానమే లక్ష్యంగా దూసుకెళతా’’నని సైనా వ్యాఖ్యానించింది. ఇక పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇదివరలోనూ నాలుగో ర్యాంకులో నిలిచిన శ్రీకాంత్, రెండోసారి మళ్లీ కెరీర్ అత్యుత్తమ ర్యాంకును సాధించాడు.