: మీరు జోక్యం చేసుకోవాల్సిందే... సస్పెన్షన్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్న టీ టీడీపీ


కేసీఆర్ సర్కారు దుర్మార్గ నిర్ణయాలపై ఇకనైనా స్పందించాలని టీ టీడీపీ రాజ్ భవన్ ను వేడుకుంటోంది. ఉద్దేశపూర్వకంగా తమపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కోరనున్నారు. ఈ మేరకు నేటి ఉదయం 10.30 గంటలకు టీ టీడీపీ నేతల బృందం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ కు ఫిర్యాదు చేయనుంది. ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం సందర్భంగా జాతీయ గీతాన్ని అవమానపరిచేలా వ్యవహరించారని ఆరోపిస్తూ కేసీఆర్ ప్రభుత్వం పది మంది టీ టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయించిన సంగతి తెలిసిందే. అయితే తామేమీ తప్పు చేయలేదని, పూర్తి స్థాయి వీడియో ఫుటేజీలు చూపకుండానే తమపై చర్యలు తీసుకున్నారని ఆరోపిస్తున్న టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, మొత్తం వీడియోను సభ ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే టీ టీడీపీ డిమాండ్లను ప్రభుత్వం వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయాలని ఎర్రబెల్లి బృందం నిర్ణయించింది.

  • Loading...

More Telugu News