: ఎత్తుగా, లావుగా ఉన్నారని ఆయనకు మైకిచ్చేస్తారు: సభలో నవ్వులు పూయించిన జగన్
బడ్జెట్ సమావేశాల సందర్భంగా కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడిపై ప్రతిపక్షనేత జగన్ విమర్శలు సంధించారు. అయితే, జగన్ విమర్శలతో శాసనసభలో నవ్వులు పూశాయి. గృహనిర్మాణంపై జగన్ విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మైక్ అందుకున్నారు. దీంతో జగన్ మాట్లాడుతూ, "ప్రశ్న అడిగితే శాఖతో సంబంధం లేకున్నా ఎత్తుగా... లావుగా ఉన్నాడని ఆయనకి మైక్ ఇచ్చేస్తారు... ఆయనేమో నోరేసుకుని అందర్నీ భయపెట్టేస్తారు... మనిషి పెరిగితే సరిపోదు... ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి" అన్నారు. దీంతో శాసనసభ ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయింది.