: కోహ్లీ సాధించాల్సింది చాలా ఉంది: డేవ్ వాట్ మోర్


టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సాధించాల్సింది చాలా ఉందని జింబాబ్వే కోచ్ డేవ్ వాట్ మోర్ అన్నారు. కోహ్లీ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పుడు డేవ్ వాట్ మోర్ కోచ్ గా పని చేశారు. భారత జట్టును కట్టడి చేసేందుకు ఏదైనా ప్రణాళిక రచించారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, కోహ్లీని కట్టడి చేసేలా జింబాబ్వే బౌలర్లకు శిక్షణ ఇవ్వడానికి తన అనుభవం తోడ్పడుతుందని భావిస్తున్నానని అన్నారు. ప్రస్తుతం క్రికెట్ బాగా ఆడే వారిలో కోహ్లీ ఒకరని ఆయన అభిప్రాయపడ్డారు. యువ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో కోచ్ పాత్ర ప్రత్యేకమని ఆయన తెలిపారు. తాను టీమిండియా అండర్-19 ఆటగాళ్లతో తక్కువ సమయమే గడిపినప్పటికీ, చాలా ఆనందంగా గడిపానని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News