: రైల్వేలు జాతీయ ఆస్తిగా పరిగణించబడతాయి: సురేష్ ప్రభు
రైల్వేలు జాతీయ ఆస్తిగా పరిగణించబడతాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. రైల్వేలలో ప్రైవేటు భాగస్వామ్యంపై ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రైల్వేలలో అవసరాన్ని బట్టి ప్రైవేటు భాగస్వామ్యం తప్పదని అన్నారు. ప్రైవేటు భాగస్వామ్యం ఉన్నంత మాత్రాన రైల్వేలు ప్రైవేటు పరం అయినట్టు భావించకూడదని వివరించారు. రైల్వేలను ప్రైవేటు పరం చేసే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. రైల్వేల సేవలు దేశానికి అవసరం అని అభిప్రాయపడ్డారు.