: వాట్సాప్ లో వాయిస్ కాలింగ్ సౌకర్యం?
ఆన్ లైన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించనుందని వార్తలు వెలువడుతున్నాయి. ఆండ్రాయిడ్ సౌకర్యం కలిగిన స్మార్ట్ ఫోన్ వినియోగదారులందరికీ 'ఇన్వైట్ విండో'తో కొన్ని గంటల పాటు వాయిస్ కాలింగ్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రపంచ మార్కెట్ లో మెసేజింగ్ యాప్ గా ఖ్యాతిగాంచిన వాట్సాప్ ఇప్పుడు వాయిస్ కాలింగ్ కూడా ఆరంభిస్తే మార్కెట్ లో మరో సాంకేతిక సంచలనం నమోదవుతుంది. స్మార్ట్ ఫోన్లో ఇంటర్నెట్ తో ఉచితంగా మెసేజింగ్ సదుపాయం కల్పించిన వాట్సాప్, తాజాగా వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని కల్పించనుండడం విశేషం. అయితే, ఈ నయా ఫీచర్ ను గూగుల్ ప్లే స్టోర్ లో కానీ, అధికారికంగా కానీ విడుదల చేయలేదని సమాచారం.