: ఏపీ బడ్జెట్ పై బొత్స కామెంట్స్


ఈ రోజు ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పై ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఏ విధమైన మంచీ జరగదన్నారు. జీరో బేస్డ్ బడ్జెట్ వల్ల ఎప్పుడైనా మిగులు రెవెన్యూ వచ్చిందా? అని ప్రశ్నించారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా బడ్జెట్ ఉందని, కేంద్రంలో భాగస్వాములుగా ఉండి కూడా ఎందుకు హామీలు సాధించుకోలేకపోతున్నారని టీడీపీ ప్రభుత్వాన్ని సూటిగా అడిగారు. లేదంటే బీజేపీని అడగడం టీడీపీ సర్కార్ కు చేతకావడం లేదా? అని బొత్స నిలదీశారు. కేంద్రం నుంచి సాయం రావడం లేదన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి మాటలకు బీజేపీ ఏం సమాధానం చెబుతుందని అడిగారు.

  • Loading...

More Telugu News