: బెంగళూరులో మూడు రోజులు గడపనున్న మోదీ
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం మూడు రోజులపాటు బెంగళూరులో జరగనుందని సమాచారం. ఏప్రిల్ లో జరగనున్న ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని తెలుస్తోంది. సమావేశం జరిగే మూడు రోజులు ఆయన బెంగళూరులోనే ఉండనున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ప్రతి మూడు నెలలకు ఓసారి జరుగుతుంది. ఒబామా పర్యటన కారణంగా జనవరిలో జరగాల్సిన సమావేశం రద్దయింది. దీంతో, ఏప్రిల్ లో నిర్వహించేందుకు బీజేపీ అధినాయకత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లో బీహార్ ఎన్నికలు ప్రధాన చర్చనీయ అంశమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.