: ఢిల్లీలో ఒమన్ విమానానికి తప్పిన ముప్పు


ఒమన్ ఎయిర్ కు చెందిన ఓ విమానానికి ప్రమాదం తప్పింది. 150 మంది ప్రయాణికులతో మస్కట్ నుంచి వచ్చిన ఈ విమానం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండయ్యే సమయంలో ముందు టైర్లు పేలిపోయాయి. అయితే, పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి ఆపద వాటిల్లలేదని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. దీనిపై స్పందించేందుకు ఒమన్ ఎయిర్ వర్గాలు అందుబాటులోకి రాలేదు.

  • Loading...

More Telugu News