: హిమాచల్ అసెంబ్లీలో డాన్స్ చేసిన సీఎం!


ప్రతిపక్ష బీజేపీ అసెంబ్లీలో చేస్తున్న తీవ్ర గందరగోళంతో వారిని ఎదుర్కొనేందుకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ డ్యాన్స్ చేశారు. ప్రతిపక్షాలను వ్యంగ్యంగా దెబ్బకొట్టాలని భావించిన ఆయన ఇలా వినూత్న విధానాన్ని ఎంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వ భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా సిమ్లాలో జనవరి 29న సీఎం కుమారుడు విక్రమాదిత్య ఆధ్వర్యంలోని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలకు, బీజేపీకి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దానిపై ఈరోజు సభలో ప్రస్తావనకు రాగా సీఎంకు వ్యతిరేకంగా బీజేపీ నినాదాలు చేసింది. ఈ సమయంలో ఆ నినాదాలకు స్పందిస్తూ వీరభద్ర సింగ్ ఆనందోత్సాహంతో నృత్యం చేశారు. అప్పటికే ఐదు రోజుల కిందట కుమార్తె వివాహం చేసిన సింగ్, సంప్రదాయ హిమాచలి డాన్స్ చేయడంతో సభ్యులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

  • Loading...

More Telugu News