: ఆకాశం మీద ఉమ్మితే మీ మీదే పడుతుంది: షబ్బీర్ కు కేసీఆర్ చురక
ప్రతి రోజు తనపై ఏదో ఒక విమర్శ చేస్తున్న కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీపై టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో మిషన్ కాకతీయను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "షబ్బీర్ ఇక్కడకు రా... చెరువులో తట్టలు మోయి" అంటూ పిలుపునిచ్చారు. ఏ కార్యక్రమంలో కూడా షబ్బీర్ కనబడరని, సోనియాగాంధీ ఇంట్లో ఉండి ఎమ్మెల్సీ అయ్యారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న మంచి పనులు కనిపించడం లేదా? అంటూ ప్రశ్నించారు. సొల్లు వాగుడు బంద్ చేయాలని సూచించారు. ఆకాశం మీద ఉమ్మితే మీ మీదే పడుతుందని అన్నారు.