: కాపులు, బ్రాహ్మణులపై ఏపీ సర్కారు కరుణ
నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముందుకు వచ్చిన 2015-16 వార్షిక బడ్జెట్లో కాపులు, బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రత్యేకంగా నిధులను యనమల ప్రకటించారు. కాపులకు రూ. 100 కోట్లు, బ్రాహ్మణులకు రూ. 37 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు వివరించారు. కాపులను వెనుకబడిన తరగతుల్లో చేరుస్తామని ఎన్నికల మానిఫెస్టోలో ప్రకటించిన తెలుగుదేశం ఇప్పుడు వారి సంక్షేమం కోసం అంటూ, నిధులను కేటాయించడం గమనార్హం. ఇదిలావుండగా, బ్రాహ్మణుల కోసం ఒక సంస్థను ఏర్పాటు చేయనున్నట్టు యనమల ప్రస్తావించారు. అర్చకుల సంక్షేమానికి కృషి చేస్తామని, నెలకు కనీసం రూ. 5 వేల వేతనం వారికి అందేట్టు చూస్తామని అన్నారు.