: చంద్రబాబును ఒప్పించే బాధ్యత మోత్కుపల్లిదే: మంద కృష్ణ


ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ అంశంలో తమ పంథాలో మార్పులేదని స్పష్టం చేశారు. ఎన్నికల వేళ తాను పెద్ద మాదిగనని పేర్కొన్న చంద్రబాబునాయుడు ఇప్పుడు మౌనం వహించడం సరికాదని అన్నారు. బాబును ఒప్పించి ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేయించే బాధ్యత మోత్కుపల్లి నర్సింహులుదేనని తేల్చిచెప్పారు. లేకపోతే తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముట్టడి ఉంటుందని తెలిపారు. అటు, ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లేలా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కడియం శ్రీహరి ఒప్పించాలని మంద కృష్ణ అన్నారు.

  • Loading...

More Telugu News