: గ్రామాన్ని దత్తత తీసుకున్న జిల్లా కలెక్టర్


రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు గ్రామాలను దత్తత తీసుకుని, వాటి అభ్యున్నతి కోసం, వసతుల కల్పన కోసం పాటుపడుతున్న విషయం విదితమే. తాజాగా, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ జానకి ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని పలువురు అధికారులకు ఆదర్శంగా నిలిచారు. ఉదయగిరి మండలంలోని తిరుమలాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు ఆమె ప్రకటించారు. పలువురు అధికారులతో కలసి ఆ గ్రామంలో తిరిగిన కలెక్టర్ జానకి... ఆ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News