: అన్నీ సత్యదూరమైన మాటలే: బడ్జెట్ పై జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2015-16 ఆర్థిక సంవత్సరానికిగానూ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైసీపీ అధినేత, అసెంబ్లీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతా అంకెలా గారడీనేనన్నారు. ఈ బడ్జెట్ లో అంతా దాచిపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. అన్నీ సత్యదూరమైన మాటలే చెప్పారని, వాస్తవానికి దూరంగా బడ్జెట్ ఉందన్నారు. ఏ పథకానికి కూడా గొప్పగా కేటాయింపులు చేశామని చెప్పుకునే పరిస్థితి లేదన్నారు. అలాగే డ్వాక్రా రుణాలపై వడ్డీ మాఫీ విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతోందో చెప్పలేదన్నారు. ఇంకా బడ్జెట్ పూర్తి ప్రసంగం చూడలేదని, మొత్తం అవగాహన చేసుకున్నాక 16న శాసనసభలో ప్రసంగిస్తానని జగన్ తెలిపారు.