: బడ్జెట్ సమావేశాల తరువాత హైదరాబాదులో కనిపించొద్దు: కేసీఆర్


అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు హైదరాబాదులో కనిపించరాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహచరులకు సూచించారు. నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ లో ఆయన మాట్లాడుతూ, నేల విడిచి సాము చేయొద్దని స్పష్టం చేశారు. సమావేశాలు ముగియగానే గ్రామాలకు వెళ్లి మిషన్ కాకతీయ పనులు చేపట్టాలని ఆయన ఆదేశించారు. గతంలో పనులు చేయకుండా నిధులు తీసుకున్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. అప్పగించిన పనులు సక్రమంగా చేయకుంటే కాంట్రాక్టర్లను జైళ్లలో పెట్టేందుకు వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News