: ముగిసిన మంత్రి యనమల సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం ముగిసింది. 12.15 నిమిషాలకు మొదలైన ప్రసంగం 2.15 వరకు కొనసాగింది. అంటే దాదాపు రెండు గంటల పాటు సభలో ఈ ప్రసంగం కొనసాగింది. ఆ వెంటనే సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రకటించారు. మరోవైపు శాసనమండలిలో మంత్రి నారాయణ బడ్జెట్ ప్రసంగం చదవి వినిపించారు. ఇదిలాఉంటే, రేపు వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.